కలం, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘రణబాలి’ (Ranabaali) రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరపైకి రాబోతోంది” అంటూ ‘రణబాలి’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. #NeverForget అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు.
టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను గతంలో సెప్టెంబర్ 11 న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించినా షూటింగ్ డిలే కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. మేకర్స్ తాజా ప్రకటనతో ‘రణబాలి’ సినిమాపై హైప్ మరింత పెరిగింది.

