మానస సరోవర యాత్ర తాత్కాలికంగా రద్దు!

కలం, వెబ్ డెస్క్ : నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన జలప్రళయం వల్ల ప్రసిద్ధ కైలాస మానస సరోవర యాత్ర (Mansarovar Yatra)కు ఆటంకం ఏర్పడింది. అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, వారధులు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ భౌగోళిక విధ్వంసం కారణంగా కైలాస మానస సరోవరానికి వెళ్లే ముఖ్యమైన రోడ్డు మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ మార్గంలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జలప్రళయం వల్ల ఖాట్మాండ్ నుంచి ప్రారంభం కావలసిన మానస సరోవర యాత్రలను అధికారులు తక్షణమే నిలిపివేశారు. మార్గమధ్యలో చిక్కుకుపోయిన పర్యాటకులు, యాత్రికుల భద్రతను సమీక్షించిన నేపాల్-టిబెట్ సరిహద్దు అధికారులు, యాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం అక్కడ ఉన్న భక్తులు, టూరిస్టులు వెంటనే తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సరిహద్దు అధికారులు అధికారికంగా సూచించారు. వరద ఉధృతి తగ్గేవరకు, రవాణా సౌకర్యాలు పునరుద్ధరించబడేవరకు ఎవరూ ఈ మార్గంలో ప్రయాణించవద్దని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>