రీల్స్ విషాదం.. రైలు ఢీకొని రెండు చేతులు కోల్పోయిన యువతి

కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్‌లోని (Jharkhand) గాఢ్వా జిల్లాలో సోషల్ మీడియా రీల్స్ మోజు ప్రాణాల మీదికి తెచ్చిన దారుణ ఘటన వెలుగు చూసింది. నాగర్-ఉంటారి రైల్వే సెక్షన్ సమీపంలో పూర్ణిమ (19) అనే యువతి రైలు పట్టాలపై నిలబడి రీల్స్ షూట్ చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన రాంచీ-చోపాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆమెను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పూర్ణిమ రెండు చేతులు నుజ్జై తెగిపోవడంతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఆమె స్నేహితులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సోషల్ మీడియా పిచ్చి యువతను ఏ విధంగా ప్రమాదాల బారిన పడేస్తోందో చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>