నేపాల్‌లో జల ప్రళయం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య

కలం, వెబ్ డెస్క్: నేపాల్‌లో సంభవించిన వరదలు (Nepal Floods) తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య 160కి చేరగా, పలు ప్రధాన జిల్లాల్లో భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ముఖ్యంగా రసువా జిల్లాలో టిబెట్ సరిహద్దు ప్రాంతాల గుండా వరదలు ఉప్పొంగాయి. దీంతో పలు ఇళ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి.

ఈ వరదల ఉధృతికి మొత్తం 384 మంది గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ గల్లంతైన వారిలో అత్యధికంగా 130 మందికి పైగా భారతీయ పౌరులు (పర్యాటకులు, యాత్రికులు, కార్మికులు) ఉన్నట్లు తెలిపింది. 105 మంది ఎన్నారైలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, గల్లంతైన వారి జాబితాలో కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికులు కూడా ఉన్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>