సారంగాపూర్‌లో జేఏసీ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కలం, నిర్మల్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సామాజిక, రాజకీయ చైతన్యం కల్పించడమే జేఏసీ లక్ష్యమని జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. బుధవారం సారంగాపూర్ (Sarangapur JAC) మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్థాయి వరకు చైతన్య కార్యక్రమాలను విస్తరించనున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, రిజర్వేషన్లు, హక్కుల కోసం జేఏసీ పోరాటం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మండల అధ్యక్షుడిగా బొడిగెల రాహుల్, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సంతోష్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామగిరి రవీందర్, కల్లూరు సుధాకర్, కుందూరు వినోద్, మేకల సింహం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>