కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని కారేగాం తాండా (Karegaon Tanda)లో చోరీ ఘటన కలకలం రేపింది. తాండాలో బట్టలు విక్రయించేందుకు వచ్చిన వ్యక్తులు ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం.. సుమారు 3 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.1 లక్ష నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు చెబుతున్నారు. ఘటనపై బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, బట్టలు విక్రయించేందుకు వచ్చిన వ్యక్తుల కదలికలు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

