ఖమ్మం వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన మోడల్ కాలనీ!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం వెలుగుమట్ల (Velugumatla) భూదాన్ భూముల్లో పేదల కోసం అన్ని వసతులతో కూడిన మోడల్ కాలనీని అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.

​కాలనీలో ఇప్పటికే విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, వాటర్ ట్యాంక్ నుంచి తాగునీటి పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ పురోగతిని బట్టి బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవుతాయని, మిగిలిన పనులను అధికారులు సమన్వయంతో గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>