కలం, నిర్మల్: సోన్ మండలంలోని జాఫ్రాపూర్ (Jafrapur) గ్రామానికి చెందిన వృద్ధుడు లోలం చిన్నయ్య అదృశ్యమైనట్లు ఎస్సై గోపి మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన చిన్నయ్య కొంతకాలంగా అనారోగ్యంతో పాటు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో బాధపడుతున్నాడు. ఈ నెల 22న ఆయన కుమారుడు సాయన్న పొలం పనులకు వెళ్లిన సమయంలో చిన్నయ్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుమారుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

