WTC ఫైనల్‌ రేసులో భారత్‌కు షాక్.. ద్రవిడ్ హెచ్చరిక

కలం, స్పోర్ట్స్​ : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) రేసులో భారత్‌కు గట్టి సవాల్ ఎదురైంది. మరో ఎనిమిది టెస్టులు మాత్రమే మిగిలి ఉండగా, సుమారు ఆరు విజయాలు అవసరమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ రేసులో కొంత వెనుకబడిందని మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తెలిపారు. ప్రస్తుతం భారత్ WTC పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టాప్-2లో నిలిచిన జట్లు మాత్రమే వచ్చే ఏడాది ఫైనల్ ఆడతాయి.

దీంతో మిగిలిన మ్యాచ్‌ల్లో భారత్ మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. రెండో టెస్టులోనూ బ్యాటింగ్‌తో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. శ్రీలంకపై వచ్చిన ఆరంభం మంచి సంకేతమని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అయితే అసలు సవాల్ ముందుంది. అక్టోబర్‌లో భారత్ న్యూజిలాండ్‌లో రెండు టెస్టులు ఆడనుంది. అక్కడి పరిస్థితులు యువ భారత ఆటగాళ్లకు కఠినంగా ఉంటాయని ద్రవిడ్ తెలిపారు.

న్యూజిలాండ్‌లో ఆడిన అనుభవం చాలామంది యువ ఆటగాళ్లకు లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ల అనుభవం లేకపోవడం కూడా ప్రభావం చూపొచ్చని అన్నారు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యమని ద్రవిడ్ సూచించారు. రాబోయే నెలల్లో గాయాలు దూరంగా ఉండాలని ఆకాంక్షించారు.

న్యూజిలాండ్ పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌లో రాణించాలని చాలా పట్టుదలగా ఉంటారని ద్రవిడ్ తెలిపారు. భారత్‌కు WTC ఫైనల్ చేరే అవకాశం ఇంకా ఉందని ద్రవిడ్ స్పష్టం చేశారు. అయితే మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన అవసరం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>