భువనగిరిలో యువజన కాంగ్రెస్ నిరసన

కలం, యాదాద్రి భువనగిరి : ఢిల్లీలో శాంతియుతంగా తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ తెలిపారు. మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంగ ప్రవీణ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, లేదా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఆ హక్కును అణచివేసే చర్యలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండి అవేస్ చిస్తి, మాజీ మునిసిపల్ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కానుకుంట్ల రేఖ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>