కలం, నిర్మల్: కడ్తాల్ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎంపీడీఓ కట్కం రామకృష్ణ (Kadthal MPDO) అన్నారు. మంగళవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం బుట్టలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త కోసం అందజేసిన బుట్టలను నిర్దేశిత ప్రయోజనానికే వినియోగించాలని సూచించారు.
ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అనంతరం భీమన్న ఆలయం వద్ద వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, ఎంపీఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

