కలం, వెబ్ డెస్క్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై రేవంత్ సర్కార్‌పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కే దిక్కులేదు కానీ.. విదేశీ విద్యను అందిస్తామంటే నమ్మాలా! అంటూ సెటైర్లు వేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఉన్న విద్యాసంస్థలే మూతపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను అవమానిస్తున్నాయని విమర్శించారు. విద్యార్థులను ఈ విధంగా వేదనకు గురి చేయడం సరికాదన్నారు. తమకు రిలీజ్ చేయాల్సిన ఫీజు బకాయిలు అడిగితే కాలేజీ యాజమాన్యాలను కాంగ్రెస్ సర్కార్ బెదరించడం తప్ప.. సాధించిందేంటి? అని మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్ బకాయిల వల్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్ధులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని విమర్శించారు.

