జర్నలిజం రంగానికి సురవరం సేవలు చిరస్మరణీయం : జర్నలిస్టులు

కలం, వనపర్తి: తెలంగాణ వైతాళికుడు, వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం వనపర్తి (Wanaparthy) పట్టణంలోని సురవరం ప్రతాప్‌రెడ్డి పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో చైతన్యం తీసుకురావడంలో సురవరం ప్రతాప్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

సాహితీవేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ‘గోల్కొండ’ పత్రికను స్థాపించి తెలంగాణలో జర్నలిజానికి విశిష్ట సేవలందించారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం జర్నలిస్టులు, యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బక్షి శ్రీధర్‌రావు, జి.శ్రీనివాస్‌యాదవ్, జానీ, గంధం దినేష్, మహమ్మద్ ఖలీల్, శ్రీనాథ్, బండార్ గోపాల్, శ్యామ్, తరుణ్, మల్లికార్జున్, ప్రముఖ క్రీడాకారుడు బొలెముని నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>