కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె అనుచరుడు, మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన కేసు విచారణలో అలసత్వం వహించినందుకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ (Jubilee Hills Inspector) ముత్తు యాదవ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దగ్గరి నుంచి సుమంత్‌ను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేటు వేశారు. మూడు వారాల కిందటే ముత్తు యాదవ్ జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఇంతలోనే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఇప్పటికే సుమంత్ డ్రైవర్, అతడి ముగ్గురు అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు.. సుమంత్ కోసం గాలిస్తున్నారు.
రియల్టర్‌ను బెదిరించినందుకు..
బోడుప్పల్‌కు చెందిన రియల్టర్ హరికృష్ణను బెదిరించి, హత్య చేస్తానని బెదిరించినట్లు సుమంత్, అతడి ముగ్గురు అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు ఈ నెల 20వ తేదీన కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణను తీవ్రంగా కొట్టినట్లు బయటకొచ్చిన ఫొటోలు సంచలనంగా మారాయి. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుమంత్ ఆమె ఓఎస్డీగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. సిమెంట్ కంపెనీపై జరిగిన వివాదంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిండంతో ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. తాజాగా, హత్యాయత్నం కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

