పర్యావరణ ఉద్యమం.. సరస్వతి శిశు మందిర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం

కలం, ​కరీంనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కరీంనగర్‌లోని (Karimnagar) స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ ఉద్యమంలో భాగంగా 1,200 మొక్కలను నాటే ప్రణాళిక రూపొందించారు. ​ఈ సందర్భంగా ఇంజనీర్ కోల అన్నారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయనను పాఠశాల యాజమాన్యం సన్మానించారు. అనంతరం ఆయన ముఖ్య నాయకులు, విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించినప్పుడే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, కొంజర్ల మహేశ్, ఈద కుమారస్వామి, పులాల శ్యామ్, సాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, సీహెచ్ వెంకటేశ్వర్లు, సోమవారపు వెంకన్న, గాలిపల్లి నాగేశ్వర్, సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>