నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌.. రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేత..!

కలం, నిర్మల్: ఇంద్రవెల్లి మండలం బుద్దనగర్‌ గ్రామానికి చెందిన కాంబ్లే జయశ్రీ గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ (Vedma Bhojju Patel) ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఆదివారం ఉట్నూర్‌ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఓసీని బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. నిరుపేదలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి టౌన్‌ ప్రెసిడెంట్‌ జితేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>