లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao)ని ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ అక్రమ రవాణా కేసులో భాగంగా ఆయన్న హైదరాబాద్ కొండాపూర్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకుంది. అనంతరం కారమూరిని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.28 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈడీ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>