జగన్ సవాల్‌ను చంద్రబాబు, లోకేష్ స్వీకరించాలి: అంబటి రాంబాబు

కలం, వెబ్ డెస్క్ : డీఎస్సీ, ఏపీసీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని తమ అధినేత జగన్ విసిరిన సవాల్ చంద్రబాబు, లోకేష్ స్వీకరించాలని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని అంబటి రాంబాబు ఆరోపించారు. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ముందుకు రావడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.

డీఎస్సీలో అక్రమాలు బయటపడతాయనే భయంతోనే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధపడటం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఇటీవల జరుగుతున్న కేబినెట్ సమావేశాలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడాన్ని అంబటి రాంబాబు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ఎందుకు కేబినెట్ సమావేశాలకు రావడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సమావేశాలకు ఎందుకు రావడం లేదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>