హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతా: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్స్‌లో స్పందించారు. ‘నాకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు. జాతీయ ప్రాధాన్యం నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన పార్టీ నాయకులకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. మూడు రోజులుగా లండన్ పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నా. అన్ని సమావేశాలు ముగించుకుని ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం బోస్టన్ (అమెరికా) కాకుండా మరికొద్ది గంటల్లో హైదరాబాద్ బయల్దేరబోతున్నా. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ రాజకీయ కారణాలతో నా పర్యటనకు అనుమతి నిరాకరించింది. దీనిపై హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతా’ అని స్పష్టం చేశారు.

కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు..

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అడ్డుకోవడంపై కేంద్ర ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. ఒక రాష్ట్ర సీఎం అమెరికా వెళ్తానంటే అడ్డుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు, విద్యా సంస్థలు రావొద్దా.. అని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎలా వివక్ష చూపుతుందో ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>