కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్ చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఈ వ్యవహారంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించాలా? లేక కొనసాగించాలా? అనే అంశంపై అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, కొండా సురేఖ భర్త కొండా మురళికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరింత ఊహాగానాలకు తావిస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన నేపథ్యంలో, కొండ మురళికి అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

