‘టాక్సిక్’ ఈవెంట్‌లో ప్రమాదం: విద్యార్థులకు గాయాలు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన కన్నడ స్టార్ నటుడు యశ్ ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఊహించని అపశృతి (Toxic Accident) చోటుచేసుకుంది. వేడుక సందర్భంగా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లడ్ లైట్ స్తంభం, సౌండ్ సిస్టమ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఆకస్మిక ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురైన ఒక యువతి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను, స్పృహ తప్పిన యువతిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>