హైద‌రాబాద్‌లో టాక్సిక్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: కేజీఎఫ్ స్టార్ య‌శ్ న‌టించిన టాక్సిక్ (Toxic) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లోని మ‌ల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు హీరోయిన్ న‌య‌న‌తార మిన‌హా మూవీ టీమ్ మొత్తం హాజ‌ర‌య్యారు. య‌శ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున రావ‌డంతో ఒకానొక స‌మ‌యంలో నిర్వాహ‌కులు వారిని కంట్రోల్ చేయ‌లేక‌పోయారు.

ఈవెంట్ నిర్వాహ‌కులు ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి స్వ‌యంగా రంగంలోకి దిగి క్రౌడ్‌ను కంట్రోల్ చేశారు. పీచే ముడ్ అంటూ మ‌ల్లారెడ్డి అంటున్న వీడియోలు, భారీగా వ‌చ్చిన అభిమానుల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. గీతా మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఈ నెల 26న విడుద‌ల కానుంది. ప్యాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిన ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>