భద్రాచలంలో అక్రమంగా అబార్షన్ కిట్ల విక్రయాలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని జీసీసీ రోడ్డులోని హోల్‌సేల్ మెడికల్ దుకాణంపై టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కొనుగోలు బిల్లులు, సరైన అనుమతులు లేకుండా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 52 అబార్షన్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ​డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అశ్వినీ, అసిస్టెంట్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ కుమార్ తనిఖీల్లో పాల్గొని అక్రమంగా నిల్వ ఉంచిన కిట్లను సీజ్ చేశారు.

హోల్‌సేల్ షాపు యజమానిపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణ, సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్లను వాడటం వలన మహిళల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. విక్రేతలు కూడా చట్టవిరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేని మందులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>