కలం, వెబ్‌డెస్క్: ట్రాక్‌పై ప్రపంచాన్ని శాసించిన ఉసేన్ బోల్ట్ (Usain Bolt).. ఇప్పుడు ఫుట్‌బాల్ మైదానంలో కనిపించనున్నాడా? 40 ఏళ్ల ఈ దిగ్గజ అథ్లెట్ పేరు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన వైథెన్షా వెట్స్ ఎఫ్‌సీ జట్టులో నమోదైంది. ఈ విషయాన్ని ఫుట్‌బాల్ అసోసియేషన్ వెబ్సైట్లో శుక్రవారం గుర్తించారు. వైథెన్షా వెట్స్ ఎఫ్‌సీ అనేది 35 ఏళ్లకు పైబడిన ఆటగాళ్లతో కూడిన జట్టు. అయితే ఈ సీజన్లో బోల్ట్ ఆ జట్టుకు ఆడనున్నాడా అనే విషయాన్ని క్లబ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బోల్ట్ ఫుట్‌బాల్‌పై ఆసక్తి చూపడం ఇదే తొలిసారి కాదు.
2017 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తర్వాత అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలికిన బోల్ట్.. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌పై దృష్టి పెట్టాడు. 2018లో ఆస్ట్రేలియా A-లీగ్ జట్టు సెంట్రల్ కోస్ట్ మారినర్స్ తరఫున స్నేహపూర్వక మ్యాచ్‌లో బోల్ట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రెండు గోల్స్ కూడా చేశాడు. ఆ తర్వాత అదే క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే కేవలం ఎనిమిది వారాలకే ఆ ఒప్పందం ముగిసింది. 2019 ప్రారంభంలో బోల్ట్ ఫుట్‌బాల్‌కు కూడా వీడ్కోలు పలికాడు.
ఇప్పుడు వైథెన్షా వెట్స్ ఎఫ్‌సీలో అతని పేరు నమోదవడంతో మరోసారి ఫుట్‌బాల్‌లోకి బోల్ట్ వస్తాడా అనే ఆసక్తి మొదలైంది. ఈ జట్టులో ఇప్పటికే పలువురు మాజీ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఉన్నారు. మాజీ ఇంగ్లండ్ స్ట్రైకర్ ఎమిల్ హెస్కీ, మాజీ మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్ ఆంటోనియో వాలెన్సియా, ప్రీమియర్ లీగ్ విజేతలు జోలియన్ లెస్కాట్, డానీ డ్రింక్వాటర్ ఈ సీజన్లో వెటరన్స్ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బోల్ట్ విషయంలో మాత్రం క్లబ్ నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఫుట్‌బాల్ అసోసియేషన్ జాబితాలో అతని పేరు ఉండటం మాత్రం ఆసక్తిని పెంచుతోంది.

