కలం, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో మురళి (Murali) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే మురళి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.

