మెట్టినింట కవిత తొలి శంఖారావం!

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత పార్టీ చీఫ్ కవిత (TRS Chief Kavitha) తొలిసారి మెట్టినింట నిజామాబాద్ లో తొలి రాజకీయ శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే ఆమె ప్రకటించిన పాంచజన్య పథకాలపై జనాల్లోకి వెళ్లేందుకు తొలి సభ నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 31న నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్స్ లో జరిగే పాంచజన్య సంకల్ప సభ సక్సెస్ కోసం పార్టీ కేడర్ గ్రౌండ్ వర్క్ లో నిమగ్నమైంది.

భారీ జనసమీకరణకు ప్లాన్

సభ సక్సెస్ ను పార్టీ అధినేత సవాల్గా తీసుకుంది. మెట్ పల్లికి చెందిన డాక్టర్ రఘును ఇన్-చార్జ్ గా నియమించారు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ప్రజలను భారీగా సమీకరించి సభకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలుత నిర్ణయించిన ఈనెల 26న మిలాద్ ఉన్ నబి పండుగ ఉన్నందున 31కి మార్పు చేశారు. టీఆర్ ఎస్ ఏర్పాటు తర్వాత పాంచజన్య సంకల్ప సభ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభలో పార్టీ తీసుకున్న లక్ష్యాలను చీఫ్ కవిత వివరిస్తారు. పార్టీ సిద్ధాంతాలను స్పష్టం చేయనున్నారు.

నేతల గ్రౌండ్ వర్క్

సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు నిజామాబాద్ లోని టీఆర్ఎస్ ఆఫీసులో శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో సమాలోచనలు చేశారు. సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు రాష్ట్ర నేతలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ అలీం సూచించారు. సభతో సత్తా చాటాలని కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జ్ డాక్టర్ రఘు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత మెట్టినింటి జిల్లా కావడంతో పార్టీ బలోపేతం కావడంఫై ఉన్నస్థాయిలోనే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>