ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు.. వివేకా హత్య కేసుపై ప్రకటన

కలం, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ( YS Avinash Reddy) నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. హైదరాబాద్, కడపలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. సీబీఐ ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు.

ఈ తనిఖీల్లో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కచూపని రూ. 24 లక్షలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. వివేకా హత్య కేసు పురోగతిలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. వివేకా హత్య చేయడానికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి రూ. 40 కోట్లు ఆఫర్ చేశారని.. రూ. 40 కోట్లలో వాటాగా రూ. 5 కోట్లు ఇస్తానని తనను ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టారని దస్తగిరి చెప్పినట్లు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>