షిరిడీ ట్రైన్‌లో 24 కిలోల ఎండు గంజాయి పట్టివేత

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) మీదుగా షిరిడీ వెళ్తున్న ట్రైన్ లో 24 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు. గంజాయి రవాణా అవుతుందని విశ్వశనీయ సమాచారం మేరకు నిజామాబాద్ రైల్వే, సివిల్ పోలీసులు కలిసి సంయుక్తంగా ట్రైన్ చెకింగ్ చేయగా, అందులో ఇద్దరు వ్యక్తులు అనుమాస్పదంగా కనిపించారు. సీటు కింద రెండు సూట్ కేస్ లతో ప్రయాణిస్తుండగా అనుమానంతో తనిఖీ చేశారు.

సూట్ కేస్ లలో 24.3 కిలోల ఎండు గంజాయి కనిపించింది. ఒడిశా నుండి షిర్డీకి రవాణా చేస్తున్నట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. పేరు తెలియని వ్యక్తి తమకు 10 వేల రూపాయలు ఇచ్చి షిర్డీలో ఒక ప్లేస్ వద్ద ఆటో ఆగి ఉంటుంది ఆ ఆటోలో పెట్టి రావాలని చెప్పినట్టుగా తెలిపారు. ఈ మేరకు నిందితులు గణేష్ పోలి, దీపక్ సాహులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేసి నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>