పిల్లల్లో పఠన సంస్కృతి పెరగాలి: నిర్మల్ డీఈవో

కలం, నిర్మల్: పిల్లల్లో పఠన సంస్కృతి పెరగాలని, అందుకోసమే రూమ్ టు రీడ్ ఇండియా ఆధ్వర్యంలో “ఇండియా గెట్స్ రీడింగ్ క్యాంపెయిన్ 8.0–2026” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి (Nirmal DEO) దర్శనం భోజన్న అన్నారు. శుక్రవారం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో “నా మాటలు నా కథ” అనే ఇతివృత్తంతో రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పిల్లల్లో అక్షరాస్యత, భాషా వికాసాన్ని బలోపేతం చేయడమే ఈ ప్రోగ్రాం లక్ష్యమన్నారు. చదవడమంటే నైపుణ్యం మాత్రమే కాదని, పిల్లల భాషా వికాసం, ఊహాశక్తి, విమర్శనాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం, స్వీయ వ్యక్తీకరణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని రోజూ నిర్వహించి విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు డీఈవో (Nirmal DEO) సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ నర్సయ్య, కమ్యూనిటీ మొబిలైజేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ లింబాద్రి, రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ కుమార్, డీఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : ‘చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>