సరిహద్దుల్లో భద్రతపై రాజీ పడబోం: అమిత్ షా

కలం, వెబ్ డెస్క్: సరిహద్దుల్లో భద్రత విషయంలో రాజీ పడబోమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. బెంగాల్ పర్యటనలో భాగంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురిలో సశస్త్ర సీమాబల్‌కు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం బీఎస్ఎఫ్ అడిగిన భూమి కూడా ఇవ్వలేదన్నారు.

కానీ, బీజేపీ ప్రభుత్వం రావడంతో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, సీఎం సువేందు అధికారి వెంటనే ఉత్తర్వులు పంపిస్తున్నారని అమిత్ షా ప్రశంసించారు. 1,129 ఎకరాల భూమిని కేవలం 45 రోజుల్లేనే సైన్యానికి ఇచ్చిందన్నారు. సిలిగురి ప్రాంతానికి సీఎం రావడం కూడా ఇదే మొదటిసారని, గత ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని అసలే పట్టించుకునేవారు కారని విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చాక చొరబాట్లు బంద్..

జాతీయ భద్రతలో సిలిగురి ప్రాధాన్యాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించిందని అమిత్ షా (Amit Shah) చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇదొక్కటే భూ మార్గమని, అత్యంత సున్నితమైన, ఎంతో ప్రాధాన్యం ఉన్న ప్రాంతమన్నారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో ఈ ప్రాంతానికి సరిహద్దు ఉందన్నారు. అందుకే, ఇక్కడ త్రి కోణాల్లో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బి రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థలో కాదని.. అవి దేశ సరిహద్దులను రక్షించే వ్యవస్థలని కొనియాడారు. సువేందు అధికారి సీఎం అయ్యాక బెంగాల్‌లో చొరబాట్లు బాగా తగ్గిపోయాయని, రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవనే విషయం ఆయనకు తెలుసని అమిత్ షా స్పష్టం చేశారు.

Also Read : సుష్మిత కామెంట్లపై మంత్రుల మౌనం.. అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>