కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) సమీపంలో హై టెన్షన్ నెలకొంది. బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా కన్వర్‌పురా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ కోకన్వీనర్ అశుతోష్ రాంకా (Ashutosh Ranka), అతని బృందాన్ని కొందరు స్థానికులు అడ్డుకుని దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సీజేపీ కార్యకర్తల్లో ఒకరి చేయి విరిగినట్లు సమాచారం అందుతోంది.
రాంపురా కన్వర్‌పురాలోని పాఠశాల ప్రధాన భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిన వేళ పాఠశాలకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న రేకుల షెడ్‌లోకి విద్యార్థులను తరలించి పాఠాలు చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు తెలిపారు. ఈ తరుణంలోనే వారి పర్యటన వేళ స్థానికులు అడ్డుకుని దాడికి తెగబడడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పశువుల పాకలో పిల్లలకు పాఠాలు చెప్తున్న దారుణాన్ని బయటపెడతామనే భయంతోనే బీజేపీ గుండాలను పంపి తమపై దాడులు చేయిస్తోందని అశుతోష్ రాంకా (Ashutosh Ranka) మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ చర్యలకు తాము బెదిరేది లేదని, విద్యార్థులకు నాణ్యమైన అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Also Read : తెలంగాణలో ఆగస్ట్ సంక్షోభం.. కాంగ్రెస్‌లో ఇన్నర్ ఫైట్!
Follow Us On: X(Twitter)

