కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి మెడికల్ స్టూడెంట్ ప్రియాంక మృతి కేసు (Priyanka Death Case)లో నిందితుల రిమాండ్‌ను శుక్రవారం జిల్లా కోర్టు పొడిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్న క్రమంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసు(Priyanka Death Case)లో గతంలోనే నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగిసిన అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. తాజాగా జిల్లా కోర్టు నిందితుల రిమాండ్ పొడిగించడంతో వారిని జైలులోనే కొనసాగనున్నారు. పోలీసుల కీలక దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రాజమండ్రిలో ఇటీవల ఇద్దరు ఉన్మాదులు ఈ నెల 3న కారుతో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టారు. చికిత్స నిమిత్తం ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి వారం రోజులు వైద్యం చేయించారు. ప్రియాంక బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రియాంక మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు ప్రకటించారు. యాక్సిడెంట్ అనంతరం వారం రోజులపాటు చికిత్స పొందుతూ చివరకు ఆమె ఆగస్టు 9న తుదిశ్వాస విడిచారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకి చెందిన ప్రియాంక.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో (GSL Medical College) పీజీ డెర్మటాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : ఆకస్మిక తనిఖీ.. టాయ్‌లెట్స్ కడిగిన మంత్రి జూపల్లి
Follow Us On: Sharechat

