హస్తినకు వనపర్తి కాంగ్రెస్ పంచాయితీ.. ఖర్గేతో ఎమ్మెల్యే మేఘారెడ్డి భేటీ

కలం, వెబ్ డెస్క్ : వనపర్తి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy), చిన్నారెడ్డి మధ్య నెలకొన్న వివాదం హస్తినకు చేరింది. ఈ నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తన అనుచర వర్గంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఎమ్మెల్యే మేఘారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఖర్గేకు ఫిర్యాదు చేశారు.

చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు మేఘారెడ్డి తెలిపారు. తాను డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుగోలు చేశానని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రిపోర్ట్ తో పాటు చిన్నారెడ్డి వాయిస్ ను కూడా ఖర్గే ముందు ఉంచినట్లు తెలిపారు. 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కన్నతల్లిలాంటి పార్టీపైన చిన్నారెడ్డి విమర్శలు చేశారని మేఘారెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలతో కలిసి పార్టీని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానం ముందుఉంచామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>