ఉల్లి నుంచి పూల వరకు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ధరలు!

కలం, వలిగొండ: వలిగొండలో (Valigonda) ఉల్లి, చక్కెర, పూల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి (Price Hike). దీంతో ఉల్లి కొనుగోలుదారులను కంట తడిపెట్టిస్తుండగా.. చక్కర వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంది. అదేవిధంగా శ్రావణమాసాన్ని పురస్కరించుకొని దేవునికి సమర్పించే పూలు మూరకు బారెడు ధర అయ్యింది.

గత రెండు రోజుల క్రితం వరకు ఉల్లిపాయలు కిలో రూ. 30 ఉండగా, నేడు ఏకంగా రూ. 50 కి చేరింది. చక్కెర కిలో రూ. 35 – 40 నుండి ఒక్కసారిగా రూ. 60 కి పెరిగింది. పూలు నిన్నటి వరకు రూ. 25 పలికిన పూల ధర, నేడు మార్కెట్లో రూ. 60 కి చేరింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో బెల్లం ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు.

ఆదాయాలు పెరగకపోయినా, ఇలా నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగల వేళ ఈ అదనపు భారం తమ బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేస్తోందని ఆందోళన చెందుతున్నారు.

Also Read :  సీఎం రేవంత్‌ అమెరికా పర్యటన రద్దు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>