ఆపిల్ మాత్రమే కాదు.. గుండె ఆరోగ్యానికి ఈ పండ్లు కూడా ఎంతో బెస్ట్!

కలం, వెబ్ డెస్క్: మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో గుండె ఒకటి. నేటి డిజిటల్ యుగంలో ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి, గంటల తరబడి కూర్చొని పని చేసే ఉద్యోగాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజురోజూకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే దైనందిన ఆహారం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యానికి కొన్ని రకాల పండ్లు (Heart-Healthy Fruits) రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆపిల్ (Apple), దానిమ్మ, రేగిపండ్లు, వివిధ రకాల బెర్రీలు. ఈ పండ్లలో ఫ్లేవనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. రక్తపోటును నియంత్రించి, ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆపిల్ కంటే ఏ పండ్లలో ఫ్లేవనాల్స్‌ ఎక్కువ?

మనలో చాలామంది గుండె ఆరోగ్యానికి ఆపిల్ పండు మాత్రమే మంచిదని భావిస్తుంటారు. కానీ ఆపిల్ కంటే కూడా రేగిపండ్లు, బ్లాక్ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, చెర్రీస్, బ్లూబెర్రీస్ వంటి పండ్లలో కూడా ఫ్లేవనాల్స్ అధికంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 2026వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ నేతృత్వంలో జరిగిన ఓ పరిశోధనలో ఆపిల్ కంటే కంటే కూడా కొన్ని పండ్లలో ఎక్కువ మొత్తంలో ఫ్లేవనాల్స్ ఉన్నట్లు గుర్తించారు.

సుమారు 200 గ్రాముల ఆపిల్ (తొక్కతో కలిపి)లో దాదాపు 110 మి. గ్రాముల ఫ్లేవనాల్స్ ఉంటాయని.. అదే సమయంలో సుమారు 200 గ్రాములు బ్లాక్ బెర్రీస్ లో 250 మి. గ్రాములు, 250 గ్రాముల క్రాన్ బెర్రీస్ లో 300 మి.గ్రాములు, 500 గ్రాముల రేగిపండ్లలో దాదాపు 450 మి. గ్రాముల ఫ్లేవనాల్స్ ఉంటాయని తెలిపారు.

ఈ పరిశోధన కేవలం ఆయా పండ్లలోని ఫేవనాల్స్ పరిమాణాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. అయితే, కేవలం ఒక పోషకం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఒక పండు కంటే మరో పండు అన్ని విధాలా గొప్పదని చెప్పలేమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక్కో పండులో ఒక్కో రకమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు ఉంటాయి. గుండె సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పోషకాలన్నీ సమతుల్యంగా అందడం అవసరమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>