కరీంనగర్‌లో ఘనంగా తీజ్ ఉత్సవాలు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగర పరిధిలోని కోతిరాంపూర్, చింతకుంట పరిధిలో తీజ్ ఉత్సవాలు (Karimnagar Teej) ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా గోధుమ మొలకల (నారు) పందిరి వద్ద కొబ్బరికాయ కొట్టి, గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లంబాడీ మహిళా సోదరీమణులతో కలిసి నృత్యాలు చేస్తూ, ఆడిపాడి ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.

తరతరాలుగా వస్తున్న తమ సాంప్రదాయాలను, సంస్కృతిని నేటి తరానికి అందిస్తూ ప్రకృతిని ఆరాధించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్,14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, 15వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల సాయి జ్యోతి కార్పొరేటర్లు తోట అనిల్, కె ఏపిపి చంద్ర, నాంపల్లి శ్రీనివాస్, బండ రమణారెడ్డి, గాజ శివరాం, దేవసాని సత్యనారాయణ, కర్రె అనిల్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>