జ‌పాన్‌లో మిరాయ్ సంచ‌ల‌నం.. బాహుబ‌లి రికార్డ్స్ బ్రేక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలుగులో సంచ‌ల‌నం సృష్టించిన మిరాయ్ (Mirai) జ‌పాన్‌లో రికార్డులు తిర‌గ‌రాస్తోంది. జ‌పాన్‌ (Japan)లో ఏ ఇండియ‌న్ మూవీకి ద‌క్క‌న‌న్ని అడ్వాన్స్ బుకింగ్స్ న‌మోదు చేసి సంచ‌ల‌నంగా మారింది. హ‌నుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజా స‌జ్జా మిరాయ్‌తో జ‌పాన్‌లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకునేంద‌కు రెడీ అయ్యాడు. జ‌పాన్ సినీ అభిమానుల‌కు మిరాయ్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ నెల 21న విడుద‌ల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఇప్పటి వరకు జపాన్‌లో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన టాప్-10 ఇండియ‌న్ మూవీస్‌లో మిరాయ్ ఏకంగా ఏడో స్థానానికి చేరుకుంది. బాహుబ‌లి, పుష్ప‌, ధురంధ‌ర్‌, టైగ‌ర్ జిందా హై వంటి సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా టైం ఉండ‌టంతో ఈ రికార్డు మ‌రింత మెరుగ‌య్యే చాన్స్ ఉంది. మిరాయ్ సినిమాకు కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వ‌హించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. జపాన్‌లో ఇండియ‌న్ మూవీస్‌కు ఉన్న క్రేజ్‌ను మిరాయ్ క్యాచ్ చేసుకుంద‌నే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటంతో జపాన్ మార్కెట్‌లో తేజ సజ్జా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. ఈ సినిమా జ‌పాన్‌లో సైతం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో టీమ్ ఉన్నారు. ఈ విజయం తేజ స‌జ్జా సినీ కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>