కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాలని దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి నిర్వహించిన ‘దిశా’ కమిటీ (Disha Committee) సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలు, గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి బోధన, ఆహార నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీలో బ్లాక్ మార్కెటింగ్‌కు తావులేకుండా నిఘా పెంచాలని సూచించారు.
జాతీయ రహదారుల భూసేకరణ, అమృత్ 2.0 కింద విలీన ప్రాంతాల తాగునీటి పనులను వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలన్నారు. డీఎంఎఫ్టీ నిధుల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వరంగల్, ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : యూపీ వారియర్స్ బిగ్ స్టెప్: స్కౌటింగ్ హెడ్‌గా నీతూ డేవిడ్!
Follow Us On: Instagram

