మున్సిపోల్స్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్ : ఏపీ మున్సిపల్ ఎన్నికలు (AP Municipal Elections) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే పూర్తికాగా, మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు నవంబర్‌తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని ప్రభుత్వం జీవో జారీ చేసంది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకోవాలని అధికారుకు సూచించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, రిజర్వేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఏపీలో త్వరలోనే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>