కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్పపోశెట్టి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, యువకులు బీజేపీలో చేరారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ కందుల హరీష్, మాజీ కౌన్సిలర్లు పోడెల్లి గణేష్, అకోజి కిషన్, నాయకులు రావుల రాంనాథ్, డి. శ్రీనివాస్, కొండాజి శ్రావణ్, గురిజాల రాజు, వేణు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

