మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్..!

కలం, జనగామ : నర్సంపేటలో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేటకు వెళ్తుండగా జనగామ పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దివంగత నేత పెద్ది సుర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపునకు వ్యతిరేకంగా ఎర్రబెల్లి నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో ఆయన నర్సంపేటకు వెళ్తుండగా మార్గమధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రబెల్లి అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసనలకు దిగారు. వెంటనే దయకర్ రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎర్రబెల్లి దయాకర్‌రావును అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read : రేగా కాంతా రావుకు హై కోర్టులో ఊరట

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>