ప్ర‌భాస్‌కు ట్రీట్మెంట్‌.. ఇన్‌స్టాలో ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ పోస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: స్టార్ హీరో ప్ర‌భాస్ (Prabhas) ఓ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ సంర‌క్ష‌ణ‌లో త‌న కాలికి జ‌రిగిన స‌ర్జ‌రీకి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. గ‌తంలో క‌ల్కి షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ గాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇట‌లీలో ఆప‌రేష‌న్ చేయించుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ కాలి గాయం కార‌ణంగా ప్ర‌భాస్ ప‌లు ఈవెంట్ల‌కు హాజ‌రు కాలేక‌పోయారు. అప్ప‌ట్లో ఆయ‌న ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. అయితే ముంబైలో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో ఆయ‌న చాలా అసౌక‌ర్యంగా ఉండటం చూసి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ప్ర‌భాస్ న‌డ‌వ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతున్న వీడియోలు అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

గ‌తంలో స‌ర్జ‌రీ చేయించుకున్న ప్ర‌భాస్ (Prabhas) త‌న కాలి గాయానికి సంబంధించి ఇప్పుడు హైద‌రాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ కేజే రెడ్డి ఆయ‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ గురించి ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొందరి విజయాలు మనలో స్ఫూర్తి నింపుతాయ‌ని, కొందరి నిరాడంబరత మనపై ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తుంద‌ని ఆయ‌న ప్ర‌భాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రభాస్‌ను వ్యక్తిగతంగా ఎరగడం, ఆయన ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు చూసే అవకాశం లభించడం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఆయన ఎంత గొప్ప విజయాలు సాధించినా ఎల్ల‌ప్పుడూ సాదాసీదాగా, ఆప్యాయంగా, వినయపూర్వకంగా ఉంటార‌ని తెలిపారు. ప్ర‌భాస్ గొప్ప వ్య‌క్తిత్వ‌మే ఆయ‌న‌ను గొప్ప స్థానంలో నిల‌బెట్టిందని చెప్పారు.

Also Read : యశ్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>