కలం, కరీంనగర్ బ్యూరో: స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా ఇల్లంతకుంట (Ellanthakunta) మండలం ఒగులాపూర్‌కు చెందిన సబ్బెర చంద్రయ్య (41) గుండెపోటుతో ఇటీవల ఆకస్మికంగా మరణించాడు. వల్లంపట్ల గ్రామంలో గతంలో విద్యనభ్యసించాడు.
విషయం తెలుసుకున్న వల్లంపట్ల ZPHS 2000-01 SSC బ్యాచ్‌కు చెందిన స్నేహితులు తమ వంతు సాయంగా అతని భార్యకు తక్షణ సాయంగా రూ. 20 వేలు పోగు చేసి అతని భార్య లతకు అందజేశారు. భవిష్యత్తులోనూ అతని భార్య పిల్లలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. చంద్రయ్య స్నేహితులను ఒబులాపూర్, వల్లంపట్ల గ్రామస్తులు అభినందించారు.
ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ.. చంద్రయ్య మృతి తమకు, ఆయన కుటుంబానికి తీరని లోటని అన్నారు. సబ్బెర చంద్రయ్య వల్లంపట్లలో తమతో చదువుకుంది ఒకటే తరగతి అయినా, తమ స్నేహితుడితో జ్ణాపకాలు చెరిగిపోలేదని అన్నారు. తక్కువ వయసులో ఆకస్మిక మరణం మమ్మల్ని కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. నాయిని రాజు, బొల్గం రాజు, జనగాం రాజు, మిత్రులు పాల్గొన్నారు.

