కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా సిరికొండ (Sirikonda) మండలం కొండాపూర్ లోని బాలాజీ రైస్ మిల్లుపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 282 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేశామని సీఐ భిక్షపతి తెలిపారు. కొండాపూర్ బాలాజీ రైస్ మిల్లు యజమాని భాస్కర్, నిర్మల్ లోని శ్రీసాయి రైస్ మిల్లు యజమాని సాయికుమార్ కలిసి ఈ రేషన్ బియ్యం దందా చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

