తిరుమల సాక్షిగా విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన!

కలం, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై స్పష్టతనిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యలను వినిపించేందుకు ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన మీడియా సమక్షంలో వెల్లడించారు.

ఈ నూతన పార్టీకి సంబంధించిన ప్రాథమిక చర్చలు, ఇతర వ్యవహారాలను ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల గొంతుకగా మారడమే లక్ష్యంగా, ప్రజల కోసమే ఈ పార్టీని స్థాపించబోతున్నానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>