ఇరాన్ దెబ్బకు ప్లాన్ ఛేంజ్? పెంటగాన్ సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌తో జరిగిన యుద్ధ పరిణామాల అనంతరం గల్ఫ్ (Persian Gulf) ప్రాంతంలో తమ సైనిక సమీకరణలను తగ్గించుకోవాలని అమెరికా రక్షణ శాఖ (Pentagon) ఆలోచిస్తోంది. దాడుల వల్ల దెబ్బతిన్న సైనిక స్థావరాలను మళ్లీ భారీ వ్యయంతో పునర్నిర్మించే బదులు, తమ బలగాలను పశ్చిమ వైపునకు తరలించే అవకాశాలను అగ్రరాజ్యం పరిశీలిస్తోందని ‘వాషింగ్టన్ పోస్ట్’ (Washington Post) కథనం పేర్కొంది.

ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల వల్ల గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు (US Military) తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో మౌలిక వసతులను తిరిగి పునర్నిర్మించడం కంటే, జోర్డాన్ (Jordan), ఇజ్రాయెల్ (Israel) లేదా సౌదీ అరేబియా (Saudi Arabia) వైపు బలగాలను తరలించడం శ్రేయస్కరమని పెంటగాన్ భావిస్తోంది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని, మిలిటరీ వ్యూహకర్తలు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని సైనిక వర్గాలు తెలిపాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>