కలం, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి (Morapalli) గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైయర్‌ను మంగళవారం గ్రామ సర్పంచ్ కట్ట రాజేందర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శితో కలిసి వాటర్ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించారు.
పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ (Morapalli) తరఫున ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు సర్పంచ్ తెలిపారు. పాఠశాలలో శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యాన్ని కల్పించినందుకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : కొలంబో వేదికగా జితో లీగ్ ధమాకా.. సూర్యకు కీలక బాధ్యత!
Follow Us On : WhatsApp

