గాంధీ హత్యపై మోదీ సమాధానం చెప్పాలి: సచిన్ సావంత్

కలం, నాగర్ కర్నూల్: గాంధీ హత్యపై ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ (Sachin Sawant) డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీ ద్వారానే ప్రతి నెల సమావేశాలు నిర్వహించడం జరుగుతుంద‌న్నారు. ఈ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని జిల్లా పరిస్థితులపై కార్యాచరణ రూపొందించి పీసీసీకి పంపించాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

గాంధీజీని గాడ్సే హతమార్చాడ‌ని సచిన్ సావంత్ అన్నారు. దీంతో వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారని తెలిపారు. దీనిపై సమాధానం చెప్పాల‌ని అడిగితే రాహుల్ గాంధీపై కేసు న‌మోదు చేశారని మండిప‌డ్డారు. గాంధీజీ హత్యపై ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ జనతా, ఇతర పార్టీలన్నీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మన్ సరిత తిరుపతయ్య, మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, గద్వాల అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, కేతురి వెంకటేష్, మల్లయ్య పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>