ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి సంజయ్

కలం, కరీంనగర్: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేమాతరం గీతాన్ని సోనియా, ఖర్గే (Mallikarjun Kharge) అవమానించడం దేశానికే సిగ్గు చేటు అని మండిపడ్డారు. భారతీయులు తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తిని నింపిన గీతం వందేమాతరం అని కొనియాడారు. దేశభక్తిపైనా కాంగ్రెస్ సెన్సార్ విధిస్తోందా? అని ప్రశ్నించారు.

చరిత్ర తెలుసుకోవాలి..

వందేమాతరం చరిత్రను సోనియాగాంధీ (Sonia Gandhi) తెలుసుకోవాలని బండి సంజయ్ కోరారు. దేశం మారితే సరిపోదు… దేశం విలువలు, సంస్కృతి, భారత దేశ వేల ఏళ్ల చరిత్ర తెలిసి ఉండాలని అన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. వందేమాతరం గీతాన్ని విని ఆనాడు బ్రిటీష్ భయపడిందని.. వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి ఈనాడు కాంగ్రెస్ వణుకుతోందని ఫైర్ అయ్యారు.

ఎంఐఎంపై ఫైర్..

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుండి తరిమికొట్టాలని బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని.. కాంగ్రెస్ నాయకత్వం సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీకి దేశభక్తి లేదని ఫైర్ అయ్యారు. ఇండియాపై పాకిస్తాన్ గెలిస్తే కరీంనగర్ లో సంబురాలు చేసుకున్న నీచ చరిత్ర ఎంఐఎం నేతలది అంటూ మండిపడ్డారు.

Also Read: పాపన్న గౌడ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయ‌కం: కేఆర్ నాగ‌రాజు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>