సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ బహుజన విప్లవ వీరుడు, హక్కుల పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం సమీపంలోని అమరవీరుల స్మారక స్థలి వద్ద ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అణచివేతకు గురైన వర్గాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను, ధీరత్వాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాపన్న గౌడ్ అభిమానులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>